AP: టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి లోకేశ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. నియోజకవర్గాల పునర్విభజన, 2029 ఎన్నికల లక్ష్యం, ప్రభుత్వ పథకాలపై చర్చ జరగనుంది. కొత్తగా ఎన్నికైన 185 మంది రాష్ట్ర కమిటీ సభ్యులతో చంద్రబాబు, లోకేశ్ భేటీ కానున్నారు.