AP: యువ నాయకుడు నారా లోకేష్ ఏపీతో పాటు జాతీయస్థాయిలోనూ ప్రభావం చూపుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన లోకేష్, మాస్ లీడర్‌గా ఎదగాలంటే ప్రజలతో మమేకమై పని చేయాలని చంద్రబాబు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని, లోకేష్ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో రాష్ట్రవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారని తెలుస్తోంది.