ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి సమీపంలో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో పామర్తి మల్లికార్జున అనే వ్యక్తి మరణించాడు. కొబ్బరికాయల కోతకు 18 మంది కూలీలు లారీలో తోటలోకి వెళ్లారు. కాయలు కోస్తుండగా, కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు లారీకి తగిలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లారీపై కూర్చున్న మల్లికార్జున మంటల్లో చిక్కుకొని మృతి చెందాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మల్లికార్జున కొబ్బరికాయల అమ్మకంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడని పోలీసులు తెలిపారు.