స్కూల్ బ‌స్సును ఢీకొట్టిన లారీ

AP: పల్నాడు జిల్లాలోని విప్పర్ల - మర్రిచెట్టుపాలెం మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విప్పర్ల వైపు వెళ్తున్న CBIT స్కూల్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్