ట్రాలీ ఆటోను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి

AP: శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం జమేదారిపుట్టుగ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాలీ ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా, వారిని చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్