హైవేపై లారీ బోల్తా.. గ్రామస్తులపై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

చిత్తూరు - పుత్తూరు హైవేపై ఆయిల్ ప్యాకెట్లతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. అయితే లారీ డ్రైవర్, క్లీనర్లను రక్షించే ప్రయత్నంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు గ్రామస్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కార్వేటి ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో రామలింగం (65) మృతిచెందారు. ఆసుపత్రిలో డాక్టర్లు లేకపోవడంతో అధికారులను స్థానికులు ఫోన్‌లో నిలదీశారు. అయితే గిరిబాబు అనే మరో వ్యక్తిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్