AP: విజయవాడ చిట్టీనగర్‌లో ప్రియురాలు తన ప్రేమను అంగీకరించలేదన్న మనోవేదనతో యశ్వంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యువతికి యశ్వంత్ కంటే ఎక్కువ వయసు ఉండటంతో ఇరువైపుల కుటుంబాలు ప్రేమను అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల యువతికి వివాహం ఖరారు కావడంతో యశ్వంత్ తీవ్ర మనస్తాపానికి గురై, స్నేహితుడికి లేఖ రాసి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.