దూసుకొస్తున్న అల్పపీడనం.. భారీ వర్షాలు

AP: దక్షిణ అండమాన్ సముద్రం-మలక్కా మధ్య అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఈ నెల 24న వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు కోస్తాంధ్ర, రాయలసీమకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్