AP: బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 17న నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడుతుందని వెల్లడించింది. దీనికి తోడు తూర్పు, పడమర ద్రోణి ఒకటి విస్తరిస్తుందని పేర్కొంది. అప్పటివరకు రాష్ట్రంలో జోరుగా వానలు కురుస్తాయంది. ఈ నెల 18వ తేదీ నుంచి కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.