అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

నైరుతి బంగాళాఖాతంతో పాటు శ్రీలంక తీరంలో అల్పపీడనం ఏర్పడిందని APSDMA శనివారం తెలిపింది. దీంతో పాటు ఉపరితల ఆవర్తనం విస్తరించినట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. అంతేకాకుండా అన్నమయ్య, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు, కడప, ప్రకాశం జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

సంబంధిత పోస్ట్