AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాబోయే 4 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. రేపు అల్లూరి, పోలవరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వానలు, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయంది. బుధవారం పోలవరం అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.