నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 36 గంటల్లో వాయుగుండంగా బలపడి ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై ప్రభావం చూపనుంది. మంగళవారం ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల్లో మోస్తరు వర్షాలు, బుధవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయనుంది. తీర ప్రాంతాల్లో 50-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని శిథిల భవనాల కింద ఉండరాదని సూచించింది.