బంగాళాఖాతంలో అల్పపీడనం

దక్షిణ అండమాన్ సముద్రంలో బుధవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో, ఈ నెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది క్రమంగా 14వ తేదీన తీవ్ర అల్పపీడనంగా, 15వ తేదీన వాయుగుండంగా మారి, 17వ తేదీ తర్వాత తుఫాన్‌గా తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారే సూచనలు ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕