బంగాళాఖాతం ఆనుకుని బంగాల్ తీరప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్రమట్టానికి 5.8 కి.మీ వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. మరో 2 రోజుల్లో ఒడిశా, బంగాల్, ఝార్ఖండ్ మీదుగా కదిలే అవకాశం ఉందని.. దీని కారణంగా ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ద్రోణి ప్రభావంతో గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.