AP: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా త్వరలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు IMD వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ నెల 14 నుంచి నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతాయని అంచనా వేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.