అల్పపీడనం ముప్పు.. భారీ వర్షాలు: APSDMA

AP: ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. దీని ప్రభావంతో వచ్చే వారంలో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఆదివారం నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని, ఇప్పటికే వెళ్లిన వారు త్వరగా తిరిగిరావాలని సూచించింది. గురువారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్

✕
✕