మాచర్ల వైసీపీ మున్సిపల్‌ ఛైర్మన్‌ కిశోర్‌పై అనర్హత వేటు

AP: పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్‌ ఛైర్మన్‌కు షాక్ తగిలింది. మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి నుంచి కిశోర్‌ను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్‌ పదవిని దుర్వినియోగం చేశారని, మున్సిపల్‌ చట్టం సెక్షన్‌ 16(1) ఉల్లంఘించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అనుమతి లేకుండా వరుసగా 15 కౌన్సిల్‌ భేటీలకు గైర్హాజరయ్యారు. దీంతో కిశోర్‌పై అనర్హత వేటు పడింది. ఇంతకుముందే కూటమి సర్కార్ కడప మేయర్‌ను తొలగించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్