ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారుల‌పై పిచ్చికుక్క దాడి

AP: పల్నాడు జిల్లా మాచవరంలో పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ ఇద్దరు చిన్నారులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులపై కుక్క దాడి చేయడంతో ఒక చిన్నారి దవడకు, మరొక చిన్నారి వీపుపై గాయాలయ్యాయి. స్థానికులు కుక్కను తరిమివేసి, గాయపడిన చిన్నారులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కుక్కల బెడద పెరిగిందని, అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్నారులతో పాటు పెద్దలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్