AP: రాష్ట్రంలో రెండు చోట్ల భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. నెల్లూరులోని సంతపేటలో పాత దుస్తుల షాపింగ్ కాంప్లెక్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనకు షార్ట్ సర్క్యూటే కారణమని తెలిసింది. దాదాపు 11 షాపులు దగ్ధమయ్యాయి. మరోవైపు కాకినాడ జిల్లా అన్నవరం రత్నగిరిపై శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. పడమటి రాజగోపురం వద్ద 5 దుకాణాలు దగ్ధమయ్యాయి.