కేఎల్ యూనివర్సిటీలో భారీ అగ్నిప్రమాదం

AP: గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం వడ్డేశ్వరం లోని కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో గురువారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వర్సిటీలోని భవనం ఐదో అంతస్తులో ఉన్న సెంట్రల్ లైబ్రరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే లైబ్రరీ అంతటా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో వేలాది పుస్తకాలు, ఫర్నిచర్ అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕