శ్రీసిటీలోని ఈ ప్యాక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

AP: తిరుపతి జిల్లా సత్యవేడు శ్రీసిటీలోని ఈ ప్యాక్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్