AP: విజయవాడ ఆటోనగర్‌లోని ప్రముఖ హ్యుందాయ్ కార్ల షోరూమ్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. భవనం పైభాగంలో ఒక్కసారిగా పొగలు, మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. షోరూమ్‌కు సెలవు రోజు కావడంతో సిబ్బంది, కస్టమర్లు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.