AP: మంగళగిరి జనసేన కార్యాలయం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వలేదని విజయ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశారు. విజయ్‌కుమార్‌రెడ్డి తండ్రి చంద్రశేఖర్‌రెడ్డి టీచర్‌గా పనిచేస్తూ 2021లో మరణించాడు. తండ్రి మరణించడంతో కారుణ్య నియామకంలో ఉద్యోగం ఇవ్వాలని విజయ్ డిమాండ్ చేశాడు. పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.