AP: కారులో మద్యం తాగుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా మర్రిపాలెంలో చోటు చేసుకుంది. సుఖదేవ్ స్వైన్ (53) నేవల్ డాక్ యార్డులో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. శనివారం మర్రిపాలెంలో మద్యం షాపులో మందు కొని కారులో తాగాడు. సాయంత్రమైనా కారు అక్కడే ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడి చేరుకుని.. సుఖదేవ్ మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడు విమాన్ నగర్ వాసిగా పోలీసులు గుర్తించారు.