డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

AP: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వినాయక నిమజ్జన ఊరేగింపులో విషాదం చోటుచేసుకుంది. డీజే పాటలకు డ్యాన్స్ చేస్తున్న కాకర్లమూడి ఏసు (48) అనే వ్యక్తి గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. వచ్చే నెలలో కుమార్తె వివాహం జరగాల్సి ఉండగా ఈ విషాద ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్

✕
✕