AP: మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కేజీకి రూ.4 చొప్పున ముందస్తు చెల్లించి మామిడి కొనుగోళ్లు కొనసాగిస్తున్నామని చెప్పారు. పంట దిగుబడి అధికంగా ఉండటంతో కొనుగోళ్లపై తాత్కాలికంగా ఒత్తిడి ఏర్పడిందని, గత ఏడాది రైతులకు సుమారు రూ.190 కోట్లు చెల్లించి ప్రభుత్వం ఆదుకుందని గుర్తుచేశారు.