మార్గదర్శి తీర్పు కిరణ్‌కు చెంపపెట్టు: జూపూడి ప్రభాకర్‌

AP: సుప్రీంకోర్టు మార్గదర్శి బాధితులకు న్యాయం చేయాలని ఇచ్చిన తీర్పు అద్భుతమని, ఇది కిరణ్‌కు చెంపపెట్టు లాంటిదని వైసీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌ అన్నారు. రామోజీరావు మరణించినందున కేసు కొట్టేయాలంటూ కిరణ్‌ కోర్టును అడగటం సిగ్గుచేటని విమర్శించారు. మార్గదర్శి ద్వారా రూ.600 కోట్లు ప్రజల నుండి అక్రమంగా డిపాజిట్లు తీసుకుని, ఆ డబ్బును ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపించారు. ఈనాడు పత్రికను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలనే బెదిరించారని, తనకు నచ్చని నేతల వ్యక్తిత్వహననానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్