AP: ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని అనుమలపల్లిలో మంగళవారం 45.01 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యధికం. ఉత్తర భారతం నుంచి వీచే పొడి గాలుల కారణంగానే ఉష్ణోగ్రతలు పెరిగాయని ఏపీఎన్డీఎంఏ తెలిపింది. గతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే రెంటచింతలను మార్కాపురం అధిగమించింది.