AP: గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మంగళవారం మండలంలో రూ.3.13 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల అభివృద్ధి టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని, డోలీమోతలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. బొర్రమామిడి, మూటకూడు, గొట్టూరు పంచాయతీల నుంచి 300 గిరిజన కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు గూడేపు యుగంధర్, సాలూరు ఏఎంసీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, ఏఎంసీ డైరెక్టర్ దోనేరు ఆనంద్‌కుమార్, నాయకులు పాల్గొన్నారు.