వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

AP: పశ్చిమగోదావరి జిల్లా, మొగల్తూరు మండలం కొత్తపాలెం గ్రామంలో మంగళవారం రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గ్రామానికి చెందిన వందమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరిలో కొత్తపాలెం మాజీ సర్పంచ్ లోకం నాగలక్ష్మి, ఆమె భర్త లోకం వెంకటేశ్వరరావు (నాని) ఉన్నారు. నరసాపురంలోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు, సీనియర్ నాయకుడు కొవ్వలి రామ్మోహన్ నాయుడు వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్

✕
✕