వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

AP: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. టీడీపీలో సాలూరు, పాచిపెంట మండలాల చెందిన మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు చేరారు. టీడీపీలో చేరిన వారికి మంత్రి సంధ్యారాణి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. 150 మంది గిరిజనులతో కలిసి టీడీపీలో కారసువలస మాజీ సర్పంచ్ లక్ష్మి చేరారు. టీడీపీలో పందిరిమామిడివలసకు చెందిన 200 మంది గిరిజనులు చేరారు. పనుకువలస, పద్మాపురం మాజీ సర్పంచ్‌లు ఏడుకొండలు, వీరయ్య, పాచిపెంట మాజీ ఎంపీటీసీ ఏడుకొండలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.

సంబంధిత పోస్ట్

✕
✕