AP: నంద్యాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గురువారం, వైసీపీకి చెందిన మాజీ సర్పంచ్ ఎల్లయ్యతో పాటు సుమారు 200 మంది నేతలు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సమక్షంలో వీరంతా టీడీపీలో చేరగా, మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు తాము ఆకర్షితులయ్యామని వారు తెలిపారు.