AP: ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం లక్కవరానికి చెందిన 30 కుటుంబాలు YCPని వీడి సోమవారం టీడీపీలో చేరాయి. టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, పార్టీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ సమక్షంలో వీరంతా టీడీపీలో చేరారు. లక్ష్మీ వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తాళ్లూరు మండలాధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి, హనుమారెడ్డి, ఆవుల ఆదినారాయణ, లక్ష్మీరెడ్డి, సుబ్బారెడ్డి, సంపతి శ్రీను, కొత్తమారం పెరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.