AP: సత్యసాయి జిల్లా, కదిరి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో 39, 33, 38వ వార్డులకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ చేరికలు 39వ వార్డు అభ్యర్థి తాత శ్రీనివాసులు, 33వ వార్డు అభ్యర్థి విజయ్ కుమార్, 38వ వార్డు అభ్యర్థి అతహర్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా ఖకాషా వలి, దాదాపీర్, రహమత్ వంటి పలువురు కార్యకర్తలకు ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.