కూటమి నుంచి వైసీపీలోకి భారీగా చేరికలు

AP: జమ్మలమడుగు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మైలవరం గ్రామానికి చెందిన బెస్త శ్రీను, రాముడు, మాజీ సర్పంచ్ సుబ్బయ్యతో పాటు మొత్తం 70 కుటుంబాలు శనివారం కూటమిని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్‌సీపీ జమ్మలమడుగు ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఎస్‌ఈసీ మెంబర్‌ గిరిధర్‌రెడ్డి మరియు ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సమక్షంలో వీరంతా పార్టీ కండువా కప్పుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ చేరికలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕