భారీ అగ్ని ప్రమాదం.. కోట్లల్లో ఆస్తి నష్టం (వీడియో)

AP: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శారదా నగర్‌ పోస్ట్‌ ఆఫీస్‌ ఎదురు ఉన్న ఓ బిల్డింగ్‌లో మంటలు ఒక్కసారిగా చెలరేగి దట్టమైన పొగ వ్యాపించింది. స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో కోట్లల్లో ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్ కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్