AP: రాష్ట్రంలో జరుగుతున్న SIR ప్రక్రియలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా ఆరోపించారు. ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకుండానే.. ఇచ్చేసినట్లు చెబుతున్నారని మండిపడ్డారు. టీడీపీ వాళ్లు ఉద్దేశపూర్వకంగానే వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేస్తున్నారని, మంత్రుల ఆదేశాలకు అధికారులు వంత పాడుతున్నారని పేర్కొన్నారు.