AP: వైసీపీ అధినేత జగన్ మావిగన్ సవాల్‌కు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కౌంటర్ వేశారు. రాష్ట్రంపై జగన్ ద్వేషం పెంచుకుని పూటకో మాట మాట్లాడుతున్నారని, మావిగన్ ముమ్మాటికీ కక్ష సాధింపుకోసమేనని అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదనే క్రిమినల్ అజెండాతో జగన్ పని చేస్తున్నారన్నారు. మూడు రాజధానుల పిచ్చి సిద్ధాంతమే గొడ్డలి పార్టీకి 11 సీట్లు ఇచ్చిందని, మావిగన్‌తో సింగిల్ డిజిట్ ఖాయమన్నారు.