ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల గడువు నేటితో ముగియనుంది. మరో 15 రోజులు గడువు పొడిగించాలని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ)కు లేఖ రాసింది. అలాగే నీట్ యూజీ అర్హత శాతాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. ఈ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎన్‌ఎంసీ వెల్లడించింది.