AP: పీపీపీ (PPP) విధానం ద్వారా రెండేళ్లలో వైద్య కళాశాలలు పూర్తి చేస్తామని సీడాప్ ఛైర్మన్ దీపక్‌రెడ్డి తెలిపారు. వైసీపీ విధానంలో దీనికి 15-20 ఏళ్లు పడుతుందని విమర్శించారు. పీపీపీ విధానంతో మెడికల్ సీట్లు 500 నుంచి 1750కి పెరుగుతాయన్నారు. పేద, మధ్యతరగతి వారికి అదనంగా 110 సీట్లు సహా మొత్తం 850 సీట్లు పేదలకే కేటాయిస్తామని తెలిపారు. పీపీపీ ఆసుపత్రుల్లో యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా పేదలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందుతుందని పేర్కొన్నారు.