28న మెగా కార్నివాల్ వాక్

AP: విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా మెగా కార్నివాల్ వాక్‌‌తో పాటు దుర్గమ్మ ఉత్సవ రథయాత్రకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో 3 వేల మంది కళాకారులు 30 రకాల ప్రదర్శనలిస్తారు. శరన్నవరాత్రుల నేపథ్యంలో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ఉత్సవ్ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 28న సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ నుంచి బెంజి సర్కిల్ వరకు రథయాత్ర సాగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్