AP: మెగా DSC-2025లో భాగంగా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు గత నెలలో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ పరీక్షలకు సంబంధించిన ప్రైమరీ ‘కీ’తో పాటు రెస్పాన్స్ షీట్లను విడుదల చేశారు. ఈ క్రమంలో AP ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రాథమిక 'కీ'పై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత సబ్జెక్టుల వారీగా తుది 'కీ'ను జూలై 25న విడుదల చేయనున్నట్టు విద్యా శాఖ అధికారులు తెలిపారు. దీని ఆధారంగా అభ్యర్థుల మెరిట్‌ను నిర్ధారించి తదుపరి దశలకు అడుగులు వేయనున్నారు.