AP: మెగా డీఎస్సీ ఫైనల్ కీ శుక్రవారం విడుదలైంది. అయితే ఇటీవల 16,347 టీచర్ నియామకాల కోసం పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రాథమిక కీ రిలీజ్ చేసి.. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. వాటిని పరిశీలించిన అనంతరం తాజాగా ఫైనల్ కీ ని విడుదల చేశారు. అభ్యర్థులు ఫైనల్ కీ కోసం https://apdsc.apsfss.in/ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.