ఇవాళ మెగా పేరెంట్-టీచర్స్ మీట్

రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు, 45వేల ప్రభుత్వ బడుల్లో శుక్రవారం మెగా పేరెంట్-టీచర్ మీట్ (PTM-3.0) జరగనుంది. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను చూపించి, వారి విద్యా ప్రగతిపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో చర్చిస్తారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని ఆదర్శ పాఠశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొంటారు. ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, దాతలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్