AP: ‘కృష్ణా నదికి వరద పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద సాయంత్రం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. నది ప్రయాణాలు, ఈతకు వెళ్లొద్దు’, ‘మొంథా తుఫాన్ ప్రభావంతో ఈ రోజు మీ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి’ అంటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలకు వచ్చిన హెచ్చరిక సందేశాలివి. దాంతో తీర ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీనిపై ఆరా తీయగా మొబైల్ కంపెనీ నెట్‌వర్క్ సమస్య కారణమని తేలింది.