మరో రెండు రోజులు భారీ వర్షాలు

ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర తీరప్రాంతం నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా మహారాష్ట్ర వరకు, కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరిన్‌ ప్రాంతం వరకు ద్రోణులు విస్తరించి ఉన్నాయి. ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో 6.8 సెం.మీ. వర్షం నమోదైంది. మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం కోస్తాంధ్రలో పిడుగులతో కూడిన వర్షాలు, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్