ఖనిజ వనరులు ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలతో స్పెషల్ మైనింగ్ మిషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రపంచ స్థాయి కంటెయినర్ ఉత్పత్తి కార్పొరేషన్ నెలకొల్పుతామని పేర్కొన్నారు. కాగా, రేర్ ఎర్త్ మినరల్స్ జాబితాలో మోనాజైట్, జెనోటైమ్, బాస్ట్‌నేసైట్, లోపరైట్ ఉన్నాయి. ఇవి ఎలక్ట్రానిక్స్ రంగంలో కీలకంగా వ్యవహరిస్తాయి.