AP: పత్తి రైతుల సమస్యలపై కేంద్ర టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. మొంథా తుఫాన్ ప్రభావంతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతిందని, రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవాల్సి వస్తోందని తెలిపారు. తడిసిన పత్తిని సరైన ధరకు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కపాస్ కిసాన్ యాప్, సీఎం యాప్ అనుసంధానంలో సాంకేతిక సమస్యలు పరిష్కరించాలన్నారు. రైతులు సమీప జిన్నింగ్ మిల్లుల్లో పత్తి అమ్ముకునేలా మ్యాపింగ్ చేయాలని కోరారు.