AP: ‘కీర్తిచక్ర' పురస్కార గ్రహీత మల్లా రాంగోపాల్ నాయుడుకు మంత్రి అచ్చెన్నాయుడు అభినందనలు తెలిపారు. శనివారం సంతబొమ్మాళి మండలం నగిరి పెంటకు చెందిన మేజర్ తన కుటుంబ సభ్యులతో కలిసి నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాంగోపాల్ చూపిన ధైర్య సాహసాలను అభినందించారు. ‘కీర్తిచక్ర' పురస్కారం తీసుకోవడం జిల్లాకే గర్వకారణమన్నారు.