ఇంటర్‌ గురుకుల విద్యార్థులకు మంత్రి డీబీవీ స్వామి అభినందనలు

AP: ఇంటర్‌ గురుకుల విద్యార్థులకు మంత్రి డీబీవీ స్వామి అభినందనలు తెలియజేశారు. ఇంటర్‌ ఫలితాల్లో గురుకుల విద్యార్థులు 96 శాతం ఉత్తీర్ణత సాధించారని మంత్రి డీబీవీ స్వామి శనివారం పేర్కొన్నారు. గతంలో కంటే మెరుగైన ఫలితాలు వచ్చాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. గురుకులాలు, హాస్టళ్లలో విద్యార్థుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. పేద విద్యార్థులు సమాజంలో గొప్పగా ఎదగాలన్నదే సీఎం లక్ష్యమని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్